‘బజార్‌ రౌడి’ విడుదలవుతున్నాడు.. ‘శేఖర్‌’ సెట్లో అడుగుపెట్టాడు

సంపూర్ణేశ్‌ బాబు కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘బజార్‌ రౌడి’. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. మహేశ్వరి వద్ది నాయిక. ఈ చిత్రాన్ని ఆగస్టు 20న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

Updated : 11 Aug 2021 17:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేశారు నటుడు సంపూర్ణేశ్‌ బాబు. తనదైన శైలిలో భారీ డైలాగులు చెప్పి విశేషంగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ‘బజార్‌ రౌడి’గా మారారు. సంపూర్ణేశ్‌ హీరోగా వసంత నాగేశ్వరరావు తెరకెక్కించిన చిత్రమే ‘బజార్‌ రౌడి’. మహేశ్వరి వద్ది నాయిక. ఈ చిత్రాన్ని ఆగస్టు 20న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ‘ఈ నెల 20న వస్తున్నాం.. ఆశీర్వదించండి, ఘన విజయం అందించండి’ అని కోరారు నటుడు సంపూర్ణేశ్‌ బాబు. మాస్‌ తరహా సన్నివేశాలతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కె.ఎస్‌. క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది.

‘శేఖర్‌’గా రాజశేఖర్‌

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ‘శేఖర్‌’. అను సితార, ముస్కాన్‌ కుబ్‌ చాందిని కథానాయికలు. లలిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ, శివానీ, శివాత్మిక నిర్మిస్తున్నారు. చిత్రీకరణ అరకులో బుధవారం పునఃప్రారంభమైందని సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు ఓ ఫొటోని విడుదల చేసింది. అరకులో బుధవారం తాజా షెడ్యూల్ మొదలైంది. దీంతో 75 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. అరకు షెడ్యూల్ తర్వాత హైదరాబాద్, శ్రీశైలం/ నాగార్జున సాగర్‌లో  చిత్రీకరణ ఉంటుంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు