BheemlaNayak: రానాకు జోడీగా ఎవరంటే?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. అహం, ఆత్మాభిమానం.. అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది...

Published : 28 Oct 2021 17:31 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. అహం, ఆత్మాభిమానం.. అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రానాకు జోడీగా ఎవరు నటించనున్నారనే విషయంపై గత కొన్నిరోజుల నుంచి చర్చ జరుగుతోంది. మొదట ఐశ్వర్య రాజేశ్‌ పేరు వినిపించగా.. ఇటీవల మలయాళీ నటి సంయుక్త మేనన్‌ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆ చర్చలన్నింటికీ చిత్రబృందం తెరదించింది. సంయుక్త మేనన్‌నే రానాకు జోడీగా ఫిక్స్ చేసినట్లు ప్రకటించింది. ‘భీమ్లానాయక్‌’ కుటుంబంలోకి సంయుక్తకు స్వాగతం తెలుపుతూ చిత్రబృందం ఓ స్పెషల్‌ పోస్టర్‌ షేర్‌ చేసింది. ఈమేరకు ఇందులో ఆమె రానాకు సతీమణి పాత్రలో కనిపించనున్నారు.

మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ‘భీమ్లానాయక్‌’ సిద్ధమవుతోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్‌.. భీమ్లానాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే రానా.. డేనియల్‌ శేఖర్‌గా అలరించనున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్పెషల్‌ వీడియోలు, పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని