
Saptagiri: సప్తగిరి కొత్త కబురు
‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ వంటి సినిమాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి. ఇప్పుడాయన సప్తగిరి హీరోగా ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. దీన్ని రిగ్వేద చౌదరి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మాత మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా రిగ్వేద చౌదరి మాట్లాడుతూ.. ‘‘వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదం ఇందులో పుష్కలంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి కూర్పు: గౌతం రాజు, ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.