Thimmarusu: సత్యదేవ్‌ లిఫ్ట్‌లో ఫైట్‌ చూశారా!

లాయరుగా సత్యదేవ్‌ నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘లిఫ్ట్‌ ఫైట్‌ సీన్‌’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది చిత్ర బృందం.

Published : 28 Jul 2021 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాయరు పాత్రలో సత్యదేవ్‌ నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘లిఫ్ట్‌ ఫైట్‌ సీన్‌’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది చిత్ర బృందం. ఓ వ్యక్తి హీరో (సత్యదేవ్‌)కి ఫోన్‌ చేసి ‘అమ్మతో కలిసి నేను ఆసుపత్రికి వచ్చా. ఇక్కడ మమ్మల్ని ఎవరో తరుముతున్నారు సర్‌. మీకు లొకేషన్‌ షేర్‌ చేస్తున్నా’ అని చెప్తాడు. ఈ మాట చెప్పి ఆసుపత్రిలోని లిఫ్ట్‌ ఎక్కుతారు ఆ తల్లీకొడుకు. వాళ్లతోపాటు విలన్‌ గ్యాంగ్ అందులోకి అడుగుపెడుతుంది. అప్పుడు ఏమవుతుందా? అనే ఆసక్తి మొదలవుతుండగా హీరో ఎంట్రీ ఇస్తాడు. రౌడీ మూకకి బుద్ధి చెప్తాడు. ఇలా ఆద్యంతం అలరించేలా ఉంది ఈ వీడియో. లిఫ్ట్‌ని ఇప్పటి వరకు చాలామంది దర్శకులు రొమాంటిక్‌ సీన్లకే పరిమితం చేశారు. పోరాటాలు చేయొచ్చని ‘తిమ్మరుసు’ బృందం చూపించింది. సత్యదేవ్‌ లుక్‌, యాక్షన్‌ ఆకట్టుకుంటున్నాయి. మరి ఆపదలో చిక్కుకుందెవరు? వాళ్లకి, సత్యకి సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మహేశ్‌ ఎస్‌. కోనేరు, సృజన్‌ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఝాన్సీ, బ్రహ్మాజీ, రవిబాబు,అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: అప్పూ ప్రభాకర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని