Acharya: వయ్యారాల వల్లరి.. వందే చంద్ర సోదరి

‘‘అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి. వందే చంద్ర సోదరి.. వస్తున్నాను నీ దరి’’ అంటూ తన ప్రేయసి నీలాంబరిని తలచుకుంటూ పాట పాడుకుంటున్నాడు సిద్ధ. మరి ఈ ఇద్దరి ప్రేమకథ ఏంటి? ఆ కథ ఏ కంచికి చేరింది? తెలియాలంటే ‘ఆచార్య’ చూడాల్సిందే.

Updated : 06 Nov 2021 10:09 IST

‘‘అయ్యోరింటి సుందరి.. వయ్యారాల వల్లరి. వందే చంద్ర సోదరి.. వస్తున్నాను నీ దరి’’ అంటూ తన ప్రేయసి నీలాంబరిని తలచుకుంటూ పాట పాడుకుంటున్నాడు సిద్ధ. మరి ఈ ఇద్దరి ప్రేమకథ ఏంటి? ఆ కథ ఏ కంచికి చేరింది? తెలియాలంటే ‘ఆచార్య’ చూడాల్సిందే. చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న చిత్రమిది. కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ సమర్పణలో నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలందించారు. చరణ్‌ ఇందులో   సిద్ధ అనే నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి నీలాంబరిగా పూజా నటిస్తోంది. ఈ ఇద్దరిపై రూపొందించిన ప్రేమ గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. ‘‘నీలాంబరి..’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ మెలోడీ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించగా.. అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా కలిసి ఆలపించారు. పాటలో చరణ్‌ వేసిన స్టెప్పులు, పూజాతో ఆయన కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉన్నాయి. ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజల్‌ నటించింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: తిరునవుక్కరసు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని