Radhe Shyam: ఒక గుండె... రెండు చప్పుళ్లు

చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్‌ నటించిన రొమాంటిక్‌ ప్రేమకథ... ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మాతలు.

Updated : 29 Nov 2021 10:30 IST

చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్‌ నటించిన రొమాంటిక్‌ ప్రేమకథ... ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మాతలు. ఈ సినిమాలోని ‘నగుమోము తారలే’ పాటని సోమవారం విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి దక్షిణాది భాషల్లో జస్టిన్‌ ప్రభాకరన్‌, హిందీలో మిథున్‌, అనూ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. అందుకే చిత్రబృందం ‘ఒకే గుండె... రెండు చప్పుళ్లు’ అనే శీర్షికతో కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ‘‘ఇటలీ  నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథ ఇది. విక్రమాదిత్యగా ప్రభాస్‌ ప్రత్యేకమైన పాత్రలో సందడి చేయనున్నారు. ఆయన్ని ఓ సరికొత్త లుక్‌లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ‘ఈ రాతలే...’ పాటకి చక్కటి స్పందన లభించింది. మంచి మెలోడీగా సాగే ‘నగుమోము తారలే..’ పాట కూడా అందరినీ అలరించేలా ఉంటుంది. ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ పనితనం, ఆయన ప్రణాళిక అడుగడుగునా కనిపిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, విజువల్‌ ఎఫెక్ట్స్‌: కమల్‌ కన్నన్‌, కూర్పు:  కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైన్‌: రసూల్‌ పూకుట్టి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని