Bheemla Nayak: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ కాస్త వెయిట్‌ చేయండి!

స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ కోసం పవర్‌స్టార్‌ అభిమానులు కాస్త ఎదురుచూడాల్సి ఉంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి రెండో పాట విడుదలను తెలియజేస్తూ చిత్రబృందం స్పెషల్‌ ప్రోమో షేర్‌ చేసింది....

Updated : 07 Dec 2022 16:49 IST

హైదరాబాద్‌: స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ కోసం పవర్‌స్టార్‌ అభిమానులు కాస్త ఎదురుచూడాల్సి ఉంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి రెండో పాట విడుదలను తెలియజేస్తూ చిత్రబృందం స్పెషల్‌ ప్రోమో షేర్‌ చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఓ పాట ప్రోమోను గురువారం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. విజయదశమి రోజున పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ‘భీమ్లానాయక్‌’ సిద్ధమవుతోంది. ఒరిజినల్‌లో బీజుమేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్రను రానా రీక్రియేట్‌ చేస్తున్నారు. ఇందులో పవన్‌ సతీమణి పాత్ర నిత్యామేనన్‌ సందడి చేయనున్న విషయం తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని