Sehari: కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్‌ దర్శకుడు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదొక చక్కని రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులోని కథ, పాత్రలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా

Updated : 01 Dec 2021 09:29 IST

ర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్‌ దర్శకుడు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదొక చక్కని రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులోని కథ, పాత్రలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటాయ’’న్నారు. ‘‘హర్ష్‌ కొత్తవాడైనా అనుభవమున్న నటుడిలా చేశారు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించాం. ఈ సినిమా కుటుంబ సమేతంగా వెళ్లి హాయిగా చూడగలిగేలా ఉంటుంద’’న్నారు నిర్మాత జిష్ణు రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అరవింద్‌ విశ్వనాథ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని