Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి కిందపడ్డారు. దీంతో నొప్పులతో...

Updated : 31 Oct 2021 13:44 IST

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడ్డారు. ఆయన్ని శనివారం రాత్రి కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని