Published : 20 Nov 2021 19:06 IST

Kaikala Satyanarayana: నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌ బులిటెన్‌ను అపోలో వైద్యులు విడుదల చేశారు. ‘సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్‌ అయ్యాయి. చికిత్సకు ఆశించినంత మేర ఆయన స్పందించటం లేదు’ అని వైద్యులు పేర్కొన్నారు.

విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సత్యనారాయణ కుటుంసభ్యులకు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గత నెల 30న కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంట్లో జారిపడటంతో కుటుంబసభ్యులు అప్పుడు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని