Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

తెలుగు చిత్రపరిశ్రమలో పేరుపొందిన సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణకు చికిత్స కొనసాగుతోందని అపోలో వైద్యులు తెలిపారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో....

Published : 22 Nov 2021 01:28 IST

హైదరాబాద్‌: అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ఆదివారం సాయంత్రం ప్రత్యేక బులిటెన్‌ విడుదల చేశారు. ఆయనకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న సత్యనారాయణ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు ఆయన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు మాట్లాడుతూ.. కైకాల స్పృహలోనే ఉన్నారని, అయితే, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వివవరించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపారు. బీపీ లెవల్స్‌ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని