Published : 29 Jul 2021 16:16 IST

Porn Video Racket: కుంద్రా ఆ రోజు ఇంటికి వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు

రాజ్‌కుంద్రాపై నటి షెర్లిన్‌ చోప్రా తీవ్ర ఆరోపణలు

ముంబయి: ‘పోర్న్‌ రాకెట్‌’ కేసులో అరెస్టై ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాపై నటి షెర్లిన్‌ చోప్రా తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్‌కుంద్రా ఒకానొక సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ఈ నెల 19న బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఇందులో భాగంగా షెర్లిన్‌ చోప్రాకు సమన్లు జారీ చేసిన పోలీసులు.. తాజాగా ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్‌కుంద్రాపై కేసు పెట్టడానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు.

కాగా, సదరు కేసు గురించి స్పందించిన షెర్లిన్‌ విస్తుపోయే నిజాలు బయటపెట్టినట్లు సమాచారం. 2019 మార్చిలో బిజినెస్‌ మీటింగ్‌ కోసం రాజ్‌కుంద్రా, అతని టీమ్‌ని కలిశానని.. మీటింగ్‌ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా రాజ్‌ తన ఇంటికి వచ్చాడని.. ఓ మెస్సేజ్‌ గురించి తనతో వాగ్వాదానికి దిగాడని షెర్లిన్‌ చెప్పినట్లు తెలుస్తోంది. శిల్పాశెట్టితో సరైన సంబంధాల్లేవని.. ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటుందని రాజ్‌ తనతో అన్నాడని షెర్లిన్‌ విచారణలో చెప్పినట్లు సమాచారం. రాజ్‌ తనని హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడని.. అసభ్యంగా ప్రవర్తించడానికి యత్నించడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయానని విచారణలో నటి వివరించినట్లు పలు వార్తా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని