Rajkundra- Shilpa Shetty: భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి శిల్పా శెట్టి పోస్ట్
‘పోర్న్ రాకెట్’ కేసులో నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను ఇటీవల ముంబయి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన భర్త అరెస్టైన నాలుగురోజుల....
ముంబయి: ‘పోర్న్ రాకెట్’ కేసులో నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను ఇటీవల ముంబయి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన భర్త అరెస్టయిన నాలుగురోజుల తర్వాత మొదటిసారి శిల్పాశెట్టి.. సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని ఓ పేరాని ఇందులో హైలైట్ చేశారు. ‘గట్టిగా ఊపిరిపీల్చుకోవడంతో.. అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసింది. గతంలో సవాళ్లు తట్టుకున్నాను.. అదే మాదిరిగా భవిష్యత్తులోనూ సవాళ్ల ఎదుర్కొంటాను. ఏం జరిగినా.. నా జీవితాన్ని నేను జీవిస్తాను. దాన్ని ఎవరూ ఆపలేరు’ అని ఆమె పెట్టిన పోస్ట్‌లో ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని ‘మాద్ దీవి’లోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్’ గుట్టుని బయటపెట్టారు. ఇందులో భాగంగానే ‘హాట్‌షాట్స్’ యాప్ నిర్వహిస్తున్న రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. రాజ్‌కుంద్రా అరెస్ట్ బాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. రాజ్‌కుంద్రా మంచివాడు కాదంటూ పలువురు నటీమణులు ఆరోపణలు చేశారు. మరోవైపు పోలీసులు.. యాప్స్ వ్యవహారంలో శిల్పాశెట్టి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Temple Tragedy: ఆలయంలో మెట్లబావి ఘటన.. 35కి చేరిన మృతులు
-
Crime News
సర్ప్రైజ్ గిఫ్ట్.. కళ్లు మూసుకో అని చెప్పి కత్తితో పొడిచి చంపారు!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!