
Puneeth Rajkumar: అప్పూ ఫొటోలు చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నా: శివరాజ్‌కుమార్
భావోద్వేగానికి గురైన నటుడు
బెంగళూరు: తన చిన్న తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్తను తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని నటుడు శివరాజ్‌కుమార్ అన్నారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా తన సోదరుడు పునీత్ గురించి మాట్లాడుతూ శివ రాజ్‌కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్ కుటుంబానికి తనకి చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని అన్నారు.
‘‘పునీత్.. మరణాన్ని ఇప్పటికీ నేనింకా నమ్మలేకపోతున్నాను. అప్పూ నా పక్కనే ఉన్నట్టు.. శివన్న అని ప్రేమగా పిలుస్తున్నట్టు అనిపిస్తోంది. రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా అర్థం కావడం లేదు. ఈ బాధ నుంచి బయటకు రావడానికి వర్క్‌పై శ్రద్ధ పెడుతున్నాను. అయినప్పటికీ.. ఎక్కడకి వెళ్లినా పునీత్ ఫొటోలే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ కన్నీళ్లు ఆగడం లేదు. అందుకే వాటిని చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. తర్వాత తేరుకొని.. జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా ఈ భూమిని వీడి వెళ్లాల్సిందే అనే జీవిత సత్యాన్ని గుర్తు తెచ్చుకొని గుండె నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. పునీత్ సతీమణి అశ్వినీ, ఇద్దరు కుమార్తెలకు నాకు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాను’’ అని శివరాజ్‌కుమార్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.