Sivasankar: ముగిసిన శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియలు.. పాడె మోసిన యాంకర్‌ ఓంకార్‌

కొవిడ్‌తో పోరాడుతూ మృతి చెందిన ప్రముఖ నృత్యదర్శకుడు శివశంకర్(sivasankar) మాస్టర్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని

Updated : 29 Nov 2021 22:00 IST

హైదరాబాద్‌: కొవిడ్‌తో పోరాడుతూ మృతి చెందిన ప్రముఖ నృత్యదర్శకుడు శివశంకర్(sivasankar) మాస్టర్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్‌ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు పంచవటి కాలనీలోని నివాసానికి పలువురు నటీనటులు, కళాకారులు హాజరై శివశంకర్ మాస్టర్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు సంతాపం తెలిపారు. ప్రముఖ నటుడు, వ్యాఖ్యాత ఓంకార్ తోపాటు ఆయన సోదరుడు అశ్విన్ బాబు, శివశంకర్ మాస్టర్ పాడె మోసి మానవత్వాన్ని చాటుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని