Oscar 2022: ఆస్కార్‌ అవార్డ్స్‌.. తుది జాబితాలో నిలిచిన భారతీయ చిత్రాలివే..!

యావత్‌ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్‌ అవార్డ్స్‌ ఒకటి. 2022గానూ ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ’లో పోటీ పడేందకు భారతీయ చలన చిత్ర పరిశ్రమ తరఫున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడుతున్నాయి.

Published : 22 Oct 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్కార్‌.. యావత్‌ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్‌. ఈ అవార్డుని అందుకోవాలని నటీనటులంతా కలలు కంటుంటారు. ఆ కలల్ని నెరవేర్చేందుకు ఏటా ఈ అవార్డుల ఉత్సవం జరుగుతుంటుంది. 2022గానూ ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ’లో పోటీ పడేందుకు భారతీయ చలన చిత్ర పరిశ్రమ తరఫున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ చిత్రాల్ని కోల్‌కతాలో ప్రదర్శిస్తున్నారు. వాటిల్లో 14 సినిమాలు తుది జాబితాలో నిలిచాయి. నాయట్టు (మలయాళం), మండేలా (తమిళం), షేర్నీ (హిందీ), సర్దార్‌ ఉద్దమ్‌ (హిందీ) తదితర చిత్రాలు షార్ట్‌ లిస్ట్‌లో ఉన్నాయి. జ్యూరీ సభ్యులు వీటిల్లోంచి ఓ చిత్రాన్ని భారతదేశం తరఫున ఆస్కార్‌కి నామినేట్‌ చేయనున్నారు. మరి వీటిలో ఏ చిత్రం నామినేట్‌ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. వచ్చే ఏడాది మార్చిలో ఈ అవార్డుల వేడుక జరగనుంది. అమెరికా ఇందుకు వేదికకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని