Gamanam: ‘గమనం’.. విడుదల ఖరారు

శ్రియ, శివ కందుకూరి, నిత్యా మేనన్‌, ప్రియాంక జవాల్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘గమనం’. సుజనా రావు దర్శకురాలు. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌

Updated : 07 Dec 2022 15:20 IST

శ్రియ, శివ కందుకూరి, నిత్యా మేనన్‌, ప్రియాంక జవాల్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘గమనం’. సుజనా రావు దర్శకురాలు. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను డిసెంబర్‌ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘సున్నితమైన అంశాలను ఎంచుకుని సుజనా ఈ సినిమాని రూపొందించారు. ఇందులో మూడు భిన్న కథలను చెప్పనున్నాం. ప్రతి ఒక్క కథ మనసుకు హత్తుకునేలా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాకి సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు అందించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని