Gamanam: ‘గమనం’.. ప్రత్యేక చిత్రమవుతుంది

శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో సుజనా రావు తెరకెక్కించిన చిత్రం ‘గమనం’. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించారు. ఇళయరాజా స్వరాలందించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated : 10 Dec 2021 09:01 IST

శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో సుజనా రావు తెరకెక్కించిన చిత్రం ‘గమనం’. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించారు. ఇళయరాజా స్వరాలందించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘జ్ఞాన శేఖర్‌ సర్‌తో నా ప్రయాణం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాతో మొదలైంది. ఆయన నిర్మాతగా మారతానని చెప్పినప్పుడు అసవరమా? అనిపించింది. కానీ, కథ విన్నాక ఇదెంత గొప్ప చిత్రమో అర్థమైంది. శ్రియ, నేను మంచి ఫ్రెండ్స్‌. ‘సంతోషం’ సినిమా సమయంలో ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే ఉంది. మంచి పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తోంది’’ అన్నారు. ‘‘సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో జీవం కనిపిస్తోంది. మంచి ఆలోచన చుట్టూ మంచిమనుషులు చేరతారు. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. అందరికీ ఓ ప్రత్యేక చిత్రంగా గుర్తుండిపోతుంది’’ అన్నారు మరో దర్శకుడు దేవ్‌ కట్టా. శ్రియ మాట్లాడుతూ ‘‘బాబా సర్‌ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. కమల పాత్రను ఇచ్చినందుకు సుజనాకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. శివ, ప్రియాంక అద్భుతంగా నటించారు’’ అన్నారు చిత్ర దర్శకురాలు సుజనా. నిర్మాత జ్ఞానశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘సుజనా చెప్పిన కథ నచ్చి.. సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చా. అంతేకానీ నిర్మాణ సంస్థ పెట్టాలని కాద’’న్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, సాయిమాధవ్‌ బుర్రా, రాజ్‌ కందుకూరి, జి.పద్మారావు, ప్రియాంక జవాల్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని