
Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్.. ఎగసిపడు అలజడి వాడే..!
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో ఇది రూపుదిద్దుకుంటోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈసినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో విడుదలైన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. విభిన్న కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని సీరియస్ లుక్‌లో కనిపించనున్నారు. సాయిపల్లవి కథానాయిక. కృతిశెట్టి, మడోన్నా కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ స్వరాలు అందిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.