Nani: నాని, సాయిపల్లవి ప్రేమకథ.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కొత్త ట్రైలర్‌ చూశారా!

‘శ్యామ్‌ సింగరాయ్‌’ కొత్త ట్రైలర్‌. నాని, సాయి పల్లవి ప్రేమ కథను చూశారా..!

Published : 02 Jan 2022 21:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా ప్రచారం విషయంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్ర బృందం వినూత్న ప్రయత్నం చేసింది. సినిమా విడుదలైన తర్వాత మరో ట్రైలర్‌ను తీసుకొచ్చి ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తోంది. నాని కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కించిన చిత్రమిది. సాయి పల్లవి, కృతిశెట్టి కథానాయికలు. మడోన్నా సెబాస్టియన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, అభినవ్‌ గోమటం తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్‌ కానుకగా విడుదలైన ఈ చిత్రం అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో ‘పోస్ట్‌ రిలీజ్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌’ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది.

ఇందులో శ్యామ్‌ సింగరాయ్‌ (నాని), రోసీ (సాయి పల్లవి) మధ్య సాగే సన్నివేశాల్ని చూపించారు. వీరిద్దరి ప్రేమ ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునేలా ఉంది. నాని ఈ చిత్రంలో శ్యామ్‌ సింగరాయ్‌తోపాటు వాసు అనే మరో పాత్రను పోషించి మెప్పించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని