Shyam Singha Roy: శ్యామ్‌ సింగరావోయ్‌

నాని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత.

Updated : 12 Nov 2021 07:38 IST

నాని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. డిసెంబర్‌ 24న తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నెల 18న టీజర్‌ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. బెంగాల్‌ గడ్డపై మీసం తిప్పిన తెలుగోడి కథతో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ తెరకెక్కిందని, ఇటీవల విడుదల చేసిన రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌ పాటకి విశేషమైన స్పందన లభించిందని సినీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ రవీంద్రన్‌, మురళీశర్మ, అభినవ్‌ గోమటం, జిషు సేన్‌ గుప్తా, లీలా సామ్సన్‌, మనీష్‌ వద్వా, బరున్‌ చందా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, కూర్పు: నవీన్‌ నూలి, కథ: సత్యదేవ్‌ జంగా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని