
Acharya: ‘సిద్ధ’ టీజర్.. వేట మొదలెట్టిన రామ్‌చరణ్!
ఇంటర్నెట్ డెస్క్: చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంలో చిరంజీవి ఆచార్యగా, రామ్ చరణ్ సిద్ధగా కనిపించనున్నారు. ఆచార్య పాత్రకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలకాగా తాజాగా సిద్ధ క్యారెక్టర్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శక్తిమంతమైన పాత్రలో చరణ్ ఒదిగిపోయారు. ఆయన గెటప్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి అమ్మోరుతల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటూ చరణ్ పలికిన సంభాషణలు ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తున్నాయి. ఇక సిద్ధ టీజర్ చివరి సీన్‌లో సెలయేరుకు ఒకవైపు చిరుత పులి, దాని పిల్ల.. మరోవైపు చిరంజీవి, రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో నీళ్లు తాగుతున్న సీన్ అదరగొట్టేసింది. దేవాదాయ శాఖకు సంబంధించిన కథాంశంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్, చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదలకానుంది.
► Read latest Cinema News and Telugu News