Updated : 25 Nov 2021 08:43 IST

Acharya: ‘సిద్ధ’ ధర్మం

చిరంజీవి, కొరటాల శివల కలయికలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో రామ్‌చరణ్‌ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 28న సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ ‘సిద్ధాస్‌ సాగా’ పేరుతో   విడుదల చేయనున్నారు. ఈ     విషయాన్ని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ‘ధర్మమే సిద్ధ’ అని
ట్విటర్‌లో పోస్టర్‌ను పంచుకున్నారు చిరంజీవి. ‘అనేక కారణాలతో సిద్ధ పాత్ర గుర్తుండిపోతుంది. శక్తిమంతమైన టీజర్‌ రానుంది’ అని ట్వీట్‌ చేశారు చరణ్‌. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్‌, చరణ్‌ సరసన పూజ హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని