SIIMA 2019: ఉత్తమ విలన్, ఉత్తమ సింగర్.. నామినేట్ అయింది వీరే..!
సైమా 2019 ఉత్తమ విలన్, ఉత్తమ సింగర్ నామినేషన్ల వివరాలు...
ఇంటర్నెట్ డెస్క్: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక త్వరలోనే సందడి చేయనుంది. హైదరాబాద్ వేదికగా సెప్టెంబరు18, 19 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2019 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పలు విభాగాల నామినేషన్లు వెలువడ్డాయి. తాజాగా ఉత్తమ విలన్, ఉత్తమ సింగర్ నామినేషన్ల వివరాల్ని సైమా ప్రకటించింది.
ఉత్తమ విలన్ కేటగిరీ: జగపతి బాబు (మహర్షి), రెజీనా కస్సాండ్ర (ఎవరు), కార్తికేయ (నానీస్ గ్యాంగ్ లీడర్), వివేక్ ఒబెరాయ్ (వినయ విధేమ రామ), సోనూసూద్ (సీత). ఉత్తమ గాయని: చిన్మయి (ప్రియతమ ప్రియతమ -మజిలీ), సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్ (సైరా టైటిల్ గీతం), మంగ్లి (వాడు నడిపే బండి- జార్జిరెడ్డి), సత్య యామిని, మోహన భోగరాజు, హరితేజ (ఓ బావ- ప్రతిరోజూ పండగే), యామిని ఘంటసాల (గిర గిర- డియర్ కామ్రేడ్). ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (ఇస్మార్ట్ శంకర్ టైటిల్ గీతం), శంకర్ మహదేవన్ (పదర పదర- మహర్షి), ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్ (తందానే తందానే- వినయ విధేయ రామ), సిధ్ శ్రీరామ్ (అరెరె మనసా- ఫలక్‌నుమాదాస్), సుదర్శన్ అశోక్ (ప్రేమ వెన్నెల- చిత్ర లహరి). తెలుగుతోపాటు కన్నడ, మలయాళ, తమిళ భాషా చిత్రాల నామినేషన్లూ వచ్చాయి. మరి ఆయా భాషల్లో ఉత్తమ విలన్, ఉత్తమ సింగర్‌గా ఎవరు పోటీ పడుతున్నారో చూసేయండి...
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు
-
World News
Mobile: ‘ఫోన్ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్‌ఫోన్ పితామహుడు
-
World News
USA: అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
-
Crime News
Mumbai: ప్రియుడితో భార్య వెళ్లిపోయిందని.. మామను చంపిన అల్లుడు
-
World News
Ferry: ప్రయాణికుల నౌకలో అగ్నిప్రమాదం.. 31 మంది మృతి..!
-
General News
Hyderabad: వ్యక్తిగత డేటా చోరీ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు