SIIMA 2020: అవార్డుల మోత మోగించిన ‘అల వైకుంఠపురములో’ 

దక్షిణాది సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) వేడుక అట్టహాసంగా సాగింది.

Updated : 19 Sep 2021 23:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాది సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) వేడుక అట్టహాసంగా సాగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. సైమా-2019 అవార్డుల వివరాలు శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సైమా- 2020 వివరాలు వెల్లడయ్యాయి. సైమా ఉత్తమ చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ అవార్డు గెలుచుకుంది. ఇదే సినిమాకిగానూ అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా, త్రివిక్రమ్‌ ఉత్తమ దర్శకుడిగా, తమన్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా, పూజా హెగ్డే ఉత్తమ నటిగా, మురళీ శర్మ ఉత్తమ సహాయ నటుడిగా, టబు ఉత్తమ సహాయ నటిగా, సముద్ర ఖని ఉత్తమ విలన్‌గా, రామజోగయ్యశాస్త్రి ఉత్తమ పాటల రచయితగా (బుట్టబొమ్మా), అర్మాన్‌ మాలిక్‌ ఉత్తమ గాయకుడి (బుట్టబొమ్మా)గా అవార్డును అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్‌ని జీవిత సాఫల్య పురస్కారం (2019) వరించింది. 

సైమా 2020 అవార్డులు అందుకున్న మరికొందరు..

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): సుధీర్‌ బాబు (వి)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): ఐశ్వర్య రాజేశ్‌ (వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌)

ఉత్తమ హాస్య నటుడు: వెన్నెల కిశోర్‌ (భీష్మ)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (సరిలేరు నీకెవ్వరు)

ఉత్తమ పరిచయ నిర్మాణ సంస్థ: అమృత ప్రొడక్షన్స్‌, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (కలర్‌ ఫొటో)

ఉత్తమ పరిచయ దర్శకుడు: కరుణ కుమార్‌ (పలాస 1978)

ఉత్తమ పరిచయ నటుడు: శివ కందుకూరి (చూసీ చూడంగానే)

ఉత్తమ పరిచయ నటి: రూప కొడువయూర్‌ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)

ఉత్తమ గాయని: మధు ప్రియ (హీజ్‌ సో క్యూట్‌: సరిలేరు నీకెవ్వరు)

‘సైమా’ అవార్డు వేడుక ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని