SIIMA2019: ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు.. పోటీలో నిలిచింది వీరే! 

దక్షిణాదిన ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా)  వేడుక మరికొన్ని రోజుల్లో సందడి చేయనుంది. హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు 11,12 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Updated : 22 Aug 2021 19:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాది సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) వేడుక మరికొన్ని రోజుల్లో సందడి చేయనుంది. హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు 11,12 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2019 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డులకు నామినేట్‌ అయిన నటుడు, నటి, దర్శకుల వివరాల్ని సైమా తాజాగా ప్రకటించింది. టాలీవుడ్‌ నుంచి ఉత్తమ నటుడి జాబితాలో .. మహేశ్‌ బాబు (మహర్షి), రామ్‌ (ఇస్మార్ట్‌ శంకర్‌), నాగ చైతన్య (మజిలీ), వరుణ్‌ తేజ్‌ (గద్దలకొండ గణేశ్‌), నాని (జెర్సీ), నవీన్‌ పొలిశెట్టి (ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ) నిలిచారు. పూజా హెగ్డే (మహర్షి),  సమంత (ఓ బేబీ), శ్రద్ధా శ్రీనాథ్‌ (జెర్సీ), రష్మిక (డియర్‌ కామ్రేడ్‌), రాశీఖన్నా (ప్రతిరోజు పండగే) ఉత్తమ నటి అవార్డుకి పోటీ పడుతున్నారు. బెస్ట్‌ డైరెక్టర్‌గా వంశీ పైడిపల్లి (మహర్షి), నందిని రెడ్డి (ఓ బేబీ), పూరి జగన్నాథ్‌ (ఇస్మార్ట్‌ శంకర్‌), అనిల్‌ రావిపూడి (ఎఫ్‌ 2), గౌతమ్‌ తిన్ననూరి (జెర్సీ), శివ నిర్వాణ (మజిలీ) పోటీ పడుతున్నారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలకు సంబంధించిన నామినేషన్లూ వెలువడ్డాయి. వాటిపై ఓ లుక్కేయండి.. 












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని