Sunitha: ఒక్కసారి గతంలోకి నడవాలనుంది.. మీ పాట వినాలనుంది..

ప్రముఖ గాయని సునీత భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎంతగానో అభిమానించే, మావయ్యా అని ప్రేమగా పిలుచుకునే ప్రముఖ గాయకుడు ఎస్పీబాలుని గుర్తు...

Published : 05 Sep 2021 16:05 IST

భావోద్వేగంతో సునీత పోస్ట్‌

హైదరాబాద్‌: ప్రముఖ గాయని సునీత భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎంతగానో అభిమానించే, మావయ్యా అని ప్రేమగా పిలుచుకునే ప్రముఖ గాయకుడు ఎస్పీబాలుని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. గురు పూజోత్సవం సందర్భంగా బాలుతో దిగిన ఓ ఫోటోని షేర్‌ చేసిన సునీత.. ‘‘మావయ్యా.. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. మీ పాట వినాలనుంది. మీరు పాడుతుంటే మళ్లీ మళ్లీ చెమర్చిన కళ్లతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో నా గొంతు మూగబోతోంది. మీరు మమ్మల్ని వదిలివెళ్లి అప్పుడే సంవత్సరం కావొస్తోందంటే నమ్మడం కష్టంగా ఉంది. ఎప్పటికీ మీరే నా గురువు, ప్రేరణ, ధైర్యం, బలం, నమ్మకం. ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చూసుకుంటావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా.. బతికేస్తున్నా..!’’ అని సునీత పోస్ట్‌ పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని