Sirivennela: మీ ప్రేమను ఎప్పటికీ మరిచిపోం: సిరివెన్నెల కుటుంబం

కష్టసమయంలో తమకు అండగా నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా, శ్రేయోభిలాషులకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Published : 02 Dec 2021 18:31 IST

హైదరాబాద్‌: కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా, శ్రేయోభిలాషులకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సిరివెన్నెల తనయుడు యోగేశ్వర శర్మ ట్వీట్‌ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మా నాన్నగారిపై ఎంతో గౌరవాన్ని చూపించింది. మా బాధ్యతను పెంచింది. ఆయన కుటుంబ సభ్యులుగా ఇందుకు గర్విస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు మాకెంతో సపోర్ట్‌ చేశాయి. నాన్నగారిని ఓ స్నేహితుడిగా, గురువుగా, ఫిలాసఫర్‌గా, గైడ్‌గా భావించిన సినిమా, మీడియా మిత్రులు తమ ప్రేమను చాటారు. మాపై మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోం’ అని పేర్కొన్నారు. సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించినట్టు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. సిరివెన్నెల న్యూమోనియా వ్యాధికి చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని