అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాటోగ్రాఫర్‌ 

తన కెమెరాతో ఎంతోమందిని స్టార్లగా మార్చి, ఎన్నో అద్భుత దృశ్యాల్ని వెండితెరపై ఆవిష్కరించి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సినిమాటోగ్రాఫర్‌ రవి కె. చంద్రన్‌. దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు.

Published : 06 Nov 2021 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కెమెరాతో ఎంతోమందిని స్టార్లను అందంగా చూపించి, ఎన్నో అద్భుత దృశ్యాల్ని వెండితెరపై ఆవిష్కరించి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సినిమాటోగ్రాఫర్‌ రవి కె.చంద్రన్‌. పలు సినిమాలతో మంచి దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. ఇప్పుడు మరోసారి ‘స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌’ చెప్పేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ‘తమర’ అనే క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌ని చూస్తుంటే ఇది నాయికా ప్రాధాన్యమున్న చిత్రంగా అనిపిస్తుంది. ఈ ఇంటర్నేషనల్‌ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రవి కె. చంద్రన్‌ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమానీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. పవన్‌ కల్యాణ్‌, రానా కథానాయకులుగా సాగర్‌ కె. చంద్ర తెరకెక్కిస్తున్నారు.

 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని