Skylab Trailer: ఆకట్టుకునేలా ‘స్కైల్యాబ్‌’ ట్రైలర్‌

నటుడు సత్యదేవ్‌, నిత్యామేనన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్కైల్యాబ్‌’. విశ్వక్‌ ఖండేవారు దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భరణి, రాహుల్‌ రామకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘స్కైల్యాబ్‌’ అనే సైన్స్‌ ఫిక్షన్‌ ...

Updated : 07 Dec 2022 20:36 IST

హైదరాబాద్‌: నటుడు సత్యదేవ్‌, నిత్యామేనన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్కైల్యాబ్‌’. విశ్వక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భరణి, రాహుల్‌ రామకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘స్కైల్యాబ్‌’ అనే సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఫన్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం శనివారం ఉదయం విడుదల చేసింది. ఇందులో సత్యదేవ్‌ ఆనంద్‌ అనే వైద్యుడిగా.. నిత్యామేనన్‌ గౌరీ అనే విలేకరిగా కనిపించనున్నారు. కథకు అనుగుణంగానే నటీనటుల వస్త్రాధారణ, వారి లుక్స్‌ కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి.

‘‘ఎంత పెద్ద వర్షం పడ్డా ఆకాశం తడవదు. గుర్తుపెట్టుకోండి’’ అంటూ నిత్యామేనన్‌ చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘‘ఒక వ్యాపారం ప్రారంభం కావాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది డిమాండ్‌, సప్లయ్‌’’ అంటూ రాహుల్‌ రామకృష్ణకు సత్యదేవ్‌కు మధ్య వచ్చే డైలాగ్‌లు నవ్వులు పూయించేలా ఉన్నాయి. పృథ్వీ పిన్నమరాజు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి నిత్యామేనన్‌ సహ నిర్మాత. డిసెంబర్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని