
Radhe Shyam: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి మరో సర్ప్రైజ్..!
ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే టీజర్, రెండు పాటల్ని (తెలుగు వెర్షన్) విడుదల చేయగా బుధవారం మరో గీతాన్ని (హిందీ వెర్షన్) విడుదల చేసింది. ‘సోచ్ లియా’ అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్- పూజా జోడీ చూడముచ్చటగా ఉంది. మనోజ్ రచించిన ఈ గీతాన్ని మిథున్, అర్జిత్సింగ్ ఆలపించారు. మిథున్ స్వరాలు సమకూర్చారు. 70ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే నటిస్తోంది. ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Advertisement