Social Look: అమితాబ్‌ అమితానందం.. కూరగాయల ధరలు చెప్పిన జగపతిబాబు

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు.

Published : 20 Sep 2021 01:43 IST

Social Look: సినీ తారలు షేర్‌ చేసిన ఫొటోలివీ...

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమన్నా ఈ రోజు ఏం చేసింది? శ్రుతి హాసన్‌ ఎలాంటి డ్రెస్‌ ధరించింది? బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె ఎలా ఉంది? మీ అభిమాన నటులు ఎవరెవరు ఏం చేశారో? ఏ మూడ్‌లో ఉన్నారో? తెలుసుకోవాలనుకుంటున్నారా! ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ ఓ లుక్కేయండి...

* పింక్‌ కలర్‌ డ్రెస్సులో దర్శనమిచ్చింది తమన్నా. యోగా చేస్తున్నట్టు ఫొటోకి పోజిచ్చి, ఆకట్టుకుంటుంది.

* శ్రుతిహాసన్‌ ‘సైమా’ అవార్డు వేడుకల్లో పాల్గొంది. స్టైలిష్‌ దుస్తుల్లో తళుక్కున మెరిసింది.

* మేకప్‌లేని తన ఫొటోని షేర్‌ చేసింది దీపికా పదుకొణె.

* జగపతి బాబు అమెరికాలో ఉన్నారు. దుకాణం నుంచి కూరగాయలు తీసుకుని తన ఇంటికి వెళ్లే మార్గంలో ఓ ఫొటో దిగి, సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. అక్కడ బీరకాయలు, ఉల్లిపాయలు, వంకాయలు, టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలిపారు.

*  ఓ ప్రముఖ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకి సంబంధించిన ఫొటోని షేర్‌ చేశారు. ఇందులో ఆయన డ్యాన్సు చేస్తూ అమితానందంగా కనిపించారు.

* శ్రీ విష్ణు పుస్తక పఠనం చేస్తూ... ఆండ్రియా నీళ్లతో ఆడుతూ కనిపించారు.





















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు