Social Look: అనుపమకి తలనొప్పి... అలసిపోయిన లైలా

ప్రముఖ కథానాయకుడు చిరంజీవిని కలిశారు దర్శకుడు సంపత్‌ నంది. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోని పంచుకుంటూ ‘నా జీవితంలో మరిచిపోలేని మరో రోజు’ అని తెలిపారు.

Updated : 17 Aug 2022 11:04 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు చిరంజీవిని కలిశారు దర్శకుడు సంపత్‌ నంది. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోని పంచుకుంటూ ‘నా జీవితంలో మరిచిపోలేని మరో రోజు’ అని ఆనందం వ్యక్తం చేశారు.

* సుమంత్‌ సరసన ‘మళ్లీ మొదలైంది’ చిత్రంలో నటిస్తోంది నైనా గంగూలీ. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని షేర్‌ చేసింది.

* షూటింగ్‌లో అలసిపోయానంటూ ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు నటి లైలా.

* నైట్‌ షూట్‌కి వెళ్లేముందు ఇలాంటి పోజులిస్తా అంటూ ఓ ఫొటో చూపించింది మెహ్రీన్‌.

* తన తలని పట్టుకుని కనిపించింది నాయిక అనుపమ పరమేశ్వరన్‌. ‘ఆనందం అంటే తలనొప్పి లేకపోవడమే’ అంటూ రాసుకొచ్చింది.

* రచయిత కోన వెంకట్‌, నటుడు బ్రహ్మాజీ సోనూ సూద్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 



























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని