Social Look: రకుల్‌ నవ్వుల థెరపీ.. విద్యా బాలన్‌ ‘షూట్‌ కాఫీ’

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు...

Published : 02 Oct 2021 01:46 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన ఫొటోని షేర్‌ చేస్తూ అక్టోబరు మాసానికి స్వాగతం పలికింది ప్రగ్యా జైస్వాల్‌.

* ‘షూట్‌, కాఫీ.. షూట్‌ కాఫీ’ అంటూ రాసుకొచ్చింది విద్యాబాలన్‌. చక్కని కాఫీని ఆస్వాదించి, ఈ వారం మీకెలా గడిచింది? అని అడిగింది.

* ఇన్‌స్టాగ్రామ్‌లో జాక్వెలిన్‌ని అనుసరిస్తోన్న వారి సంఖ్య 55 మిలియన్‌లు దాటింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జాక్వెలిన్‌ కొత్త ఫొటోని పంచుకుంది.

* ‘బాగా నవ్వండి. ఈ థెరపీ (చికిత్స) ఉచితమే’ అంటూ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. నవ్వులు విరబూసిన తన ఫొటోని షేర్‌ చేసింది.

* కొన్ని రోజులుగా పరిణీతి చోప్రా మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోంది. ఎప్పటిలానే ఈరోజూ అక్కడ దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.






















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని