Social Look: లక్ష్మిరాయ్ ఫస్ట్‌ రీల్స్‌.. పాలు పితికిన నివేదా థామస్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు.

Published : 08 Sep 2021 01:18 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* చిన్నపిల్లలతో కలిసి నటించడం తనకిష్టమని నటుడు సుధీర్‌ బాబు తెలిపారు. ఆయన హీరోగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమాకి సంబంధించిన ఫొటోల్ని పంచుకున్నారు. వాటిల్లో సుధీర్‌తోపాటు బాలనటులు దర్శనమిచ్చారు.

* ‘కరెంట్‌’ అనే గీతానికి సంబంధించి తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ప్రయత్నించింది లక్ష్మిరాయ్‌. 

* తను నాయికగా నటించిన ‘మను’ చిత్రం మూడేళ్లు పూర్తి చేసుకుందని చాందిని చౌదరి తెలిపింది. ‘ఎమోషనల్‌ స్టిల్‌’ అంటూ అప్పటి తన ఫొటోని షేర్‌ చేసింది.

* బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ ‘ఓ మై ఘోస్ట్‌’ అనే సినిమాతో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని తెలిపింది.

* యువనటి నివేదాథామస్‌ ఆవుపాలు పితుకుతూ కనిపించింది.

* తన తండ్రి, నటుడు మమ్ముట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు దుల్కర్ సల్మాన్‌.


































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని