Social Look: ఇలియానా హ్యాపీ డ్యాన్స్‌.. మిలటరీ రెస్టారెంట్‌లో శంకర్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు. 

Published : 09 Sep 2021 01:27 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ...

* నటి ఇలియానా సరదాగా డ్యాన్సు చేసింది. సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘హ్యాపీ డ్యాన్స్‌’ అని రాసుకొచ్చింది.

* ఎర్రని దుస్తులు ధరించి, ఎర్రని గులాబిని పట్టుకుని కనిపించింది యువ నాయిక అమైరా దస్తూర్‌.

* నటుడు సుశాంత్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేశాడు.

* బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ తన ఫొటోషూట్‌కి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది.

* ప్రముఖ దర్శకుడు శంకర్‌ హైదరాబాద్‌లోని ‘1980 మిలటరీ రెస్టారెంట్‌’లో సందడి చేశారు. తన తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌సీ 15‘ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రబృందంతో కలిసి అక్కడి వంటల్ని రుచి చూశారు. రామ్ చరణ్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా ఇది.














































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని