Social Look: శ్రీముఖి గ్యాలరీలో 16వేల ఫొటోలు.. ‘బంగారు’ చీరలో ప్రగ్యాజైస్వాల్‌

బిగ్‌బాస్‌ -15 షోలో కంటెస్టెంట్‌గా ఉన్న తన చెల్లి షమితా శెట్టిని ఎంతో మిస్‌ అవుతున్నట్లు చెప్పింది

Published : 01 Jan 2022 01:25 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ.. 

* బిగ్‌బాస్‌ -15 షోలో కంటెస్టెంట్‌గా ఉన్న తన చెల్లి షమితా శెట్టిని ఎంతో మిస్‌ అవుతున్నట్లు చెప్పింది శిల్పా శెట్టి. ఆ షోలో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది.

* మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు.. మీకున్న అనుకూల మార్గాలను లెక్కపెట్టండని అంటోంది కృతి శెట్టి.

* బంగారంతో తయారు చేసిన చీరలో ప్రగ్యాజైస్వాల్‌ మెరిసిపోతోంది. ఈ చీరకు 4 క్యారెట్‌ బంగారం ఉపయోగించారని చెబుతూ ఫొటోలు షేర్‌ చేసుకుంది.

* సోనాక్షి సిన్హా, నభా నటేశ్‌, శ్రీముఖి 2021 ఏడాది జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. వాటన్నింటిని ఒకేచోట చేర్చి వీడియోలను పంచుకున్నారు. శ్రీముఖి గ్యాలరీలో 16,229 ఫొటోలు ఉన్నాయట.

* వింటేజ్‌ లుక్‌ అంటూ ‘కురుప్‌’ చిత్రంలోని ఓ సన్నివేశంలోని ఫొటోను షేర్‌ చేసింది అనుపమ పరమేశ్వరన్‌.

* ఈ ఏడాదికి ఇదే చివరి రోజంటూ మోహ్రీన్‌ దుబాయ్‌లో దిగిన ఫొటోను పోస్టు చేసింది.



























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని