తండ్రిని సర్‌ప్రైజ్‌ చేసిన రాశి.. వానపాటతో అనిల్‌ రావిపూడి

‘‘బ్రోడాడీ’ టీం నేనొస్తున్నా’ అంటూ కారులో ప్రయాణిస్తున్న ఫొటోని పంచుకున్నారు నటి మీనా. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మీనా నాయికగా నటిస్తున్నారు.

Published : 21 Jul 2021 19:47 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘బ్రోడాడీ’ టీం నేనొస్తున్నా’’ అంటూ కారులో ప్రయాణిస్తున్న ఫొటోని పంచుకున్నారు నటి మీనా. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మీనా నాయికగా నటిస్తున్నారు.

* తన పేరు ఎప్పుడూ మెరిసిపోవాలంటుంది ‘తెల్లవారితే గురువారం’ ఫేం చిత్ర శుక్ల. చిత్ర అనే పేరుతో ఉన్న గొలుసును ధరించి, ఆ ఫొటోని షేర్‌ చేసింది.

* ‘జుత్తుని కొంచెం పక్కని నెట్టు.. ముఖం కనిపించడం లేదు’ అని తన ఫొటోకి తానే కామెంట్‌ పెట్టింది నాయిక కేథరిన్‌ ట్రెసా.

* దర్శకుడు అనిల్‌ రావిపూడి నివసించే ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తోంది. ఆ రొమాంటిక్‌ మూడ్‌లో ‘ఏం వానో తరుముతున్నది’ అనే పాటని ఆస్వాదించారాయన. 

* యువ నాయిక రాశీఖన్నా తండ్రి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమె ప్లాన్‌ చేసిన సర్‌ప్రైజ్‌ని అభిమానులతో పంచుకుంది.





























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని