Sonakshi Sinha: నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగిన అభిమాని.. సోనాక్షి స్పందన ఇదే!

 ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడిగిన ఓ నెటిజన్‌కి బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా తనదైన శైలిలో సమాధానం ఇచ్చి, నెట్టింట ఆకట్టుకుంటోంది. సోనాక్షి సినిమాతో ఎంత బిజీగా ఉన్నా సామాజిక మాధ్యమాల వేదికగా  అభిమానులతో అప్పుడప్పుడూ ముచ్చటిస్తూనే ఉంటుంది.

Published : 25 Aug 2021 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’అని అడిగిన ఓ నెటిజన్‌కి బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా తనదైన శైలిలో సమాధానం ఇచ్చి, నెట్టింట ఆకట్టుకుంటోంది. సోనాక్షి.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో అప్పుడప్పుడూ ముచ్చటిస్తూనే ఉంటుంది. ఎప్పటిలానే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ పేరిట ఓ సెషన్‌ నిర్వహించింది. ప్రశ్నలు అడిగిన వారందరికీ సరదాగా రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌/ అభిమాని ‘మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడగ్గా  ‘ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇలాంటి ప్రపోజల్స్‌ని అంగీకరించట్లేదు’ అని సోనాక్షి సమాధానం ఇచ్చింది. మరికొందరు నెటిజన్లు తన ఫోన్‌ వాల్‌పేపర్‌ని, యూట్యూబ్‌ హిస్టరీని చూపించమని కోరగా సంబంధిత వివరాల్ని స్క్రీన్‌షాట్‌ తీసి వారితో పంచుకుంది. మరి సోనాక్షి ఏ వాల్‌పేపర్‌ సెట్‌ చేసుకుందో, యూట్యూబ్‌లో ఏం చూసిందో మీరూ చూసేయండి...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని