Sonu Sood: జాతీయపతాకం, సోనూసూద్‌.. కిలిమంజారోను తాకిన అభిమానం

కరోనా కష్టకాలంలో నేనున్నానంటూ అడిగిన వారందరికీ సాయం చేసి, రియల్‌ హీరోగా నిలిచారు సోనూసూద్‌. దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

Updated : 18 Aug 2021 10:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కష్టకాలంలో అడిగిన వారందరికీ నేనున్నానంటూ సాయం చేసి, రియల్‌ హీరోగా నిలిచారు సోనూసూద్‌. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తినిచ్చారు. కోట్ల మంది హృదయాల్ని గెలుచుకున్నారు. సోనూ సాయం పొందిన వారు, ఆయన మంచితనాన్ని గుర్తించిన వారూ ఏదో విధంగా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో పలు దుకాణాలకు, కొందరు చిన్నారులకు ‘సోనూ’ పేరు పెట్టుకున్నారు. మరికొందరు పాద యాత్ర చేసి సోనూపై అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవల.. ఉమాసింగ్‌ అనే ఓ అభిమాని సోనూపై తనకున్న ఇష్టాన్ని సాహసోపేతంగా తెలియజేశాడు. సైక్లిస్ట్‌, మౌంటైనర్‌ అయిన ఉమాసింగ్‌ ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతం పైకి చేరుకొని సోనూసూద్‌, త్రివర్ణ పతాకం ఉన్న ఫొటోను ప్రదర్శించారు. ‘ది రియల్‌ హీరో ఆఫ్ ఇండియా’ అంటూ సోనూసూద్‌ని అభివర్ణించాడు. ఈ దృశ్యాల్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల వేదికగా ఉంచాడు. దీనిపై సోనూ స్పందించారు. ‘వావ్‌.. నేనూ కిలిమంజారో పర్వతం అధిరోహించాననుకుంటున్నా. చాలా గర్వంగా ఉంది ఉమ’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని