Manchi Rojulu Vachayi: సో సోగా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే

సంతోశ్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. యువీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Published : 17 Aug 2021 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంతోశ్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. యువీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలోని తొలిగీతాన్ని (లిరికల్‌ వీడియో) తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ‘సో సోగా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే’ అంటూ సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. సంతోశ్‌- మెహరీన్‌ జోడీ ఆకట్టుకుంటోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. కె.కె. సాహిత్యం అందించిన ఈ పాటని సిధ్‌ శ్రీరామ్‌ చక్కగా ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. లాక్‌డౌన్‌ సమయంలో రెండు ఇళ్ల మధ్య జరిగే కథ ఇది. వినోదాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు గోపీచంద్‌ హీరోగా ‘పక్కా కమర్షియల్‌’ చిత్రం తెరకెక్కిస్తున్నారు మారుతి. రాశీ ఖన్నా కథానాయిక.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని