RRR: రామమ్‌.. రాఘవమ్‌

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలోని రైజ్‌ ఆఫ్‌ రామ్‌ పాటని విడుదల చేసింది చిత్రబృందం. రామమ్‌ రాఘవమ్‌..అంటూ సాగే ఆ పాటలో అల్లూరి సీతారామరాజు లుక్‌లో రామ్‌చరణ్‌ చేసిన సందడి ఆసక్తిని రేకెత్తించింది. సంస్కృత పదాలతో కూడిన ఈ పాటని

Updated : 01 Jan 2022 09:34 IST

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలోని రైజ్‌ ఆఫ్‌ రామ్‌ పాటని విడుదల చేసింది చిత్రబృందం. రామమ్‌ రాఘవమ్‌..అంటూ సాగే ఆ పాటలో అల్లూరి సీతారామరాజు లుక్‌లో రామ్‌చరణ్‌ చేసిన సందడి ఆసక్తిని రేకెత్తించింది. సంస్కృత పదాలతో కూడిన ఈ పాటని సీనియర్‌ రచయిత కె.శివ దత్తా రచించగా, విజయ్‌ ప్రకాశ్‌, చందన బాలకల్యాణ్‌, చారు హరిహరణ్‌ ఆలపించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ని అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు.డి.వి.వి.దానయ్య నిర్మించారు. ఈ నెల 7న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని