Vinayaka Chaturthi: వినాయక చవితి స్పెషల్‌ సాంగ్స్ విన్నారా..!

దైవభక్తి పాటలతో తరచూ అలరిస్తున్న ప్రముఖ గాయని మంగ్లీ మరోసారి తన పాటతో ఆకట్టుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా గణపతి పాటతో మెప్పించారు....

Updated : 10 Sep 2021 14:51 IST

హైదరాబాద్‌: భక్తి పాటలతో తరచూ అలరిస్తోన్న ప్రముఖ గాయని మంగ్లీ మరోసారి ఆకట్టుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా గణపతి పాటతో మెప్పించారు. ప్రజల జీవన స్థితిగతులను.. గణనాథుడి గొప్పతనాన్ని.. ఈ పాటలో వివరించారు. ‘గజానన గణపతి గజముఖుడే.. భజనతో భక్తి చూపూ పొంగిపోతడే..’ అంటూ సాగే ఈ పాటకు లక్ష్మణ్‌ లిరిక్స్‌ అందించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో రెండోస్థానంలో దూసుకెళ్తోంది. మంగ్లీతోపాటు రాహుల్‌ సిప్లిగంజ్‌, మధుప్రియ, శ్రేయాఘోషల్‌ సైతం ఏకదంతుడిపై పాటలు విడుదల చేశారు. ఒక్కసారి ఆ పాటలపై మీరూ ఓ లుక్కేయండి..!





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని