SpiderMan: అబ్బురపరిచే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ‘స్పైడర్‌మ్యాన్‌ - నో వే హోమ్‌’

‘స్పైడర్‌మ్యాన్‌’ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్న విషయం తెలిసిందే. ప్రపంచాన్ని రక్షించడం కోసం దుష్టులతో స్పైడర్‌మ్యాన్‌ చేసే యుద్ధ విన్యాసాలు....

Updated : 30 Jul 2022 14:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘స్పైడర్‌మ్యాన్‌’ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని రక్షించడం కోసం దుష్టశక్తులతో స్పైడర్‌మ్యాన్‌ చేసే యుద్ధ విన్యాసాలు ప్రతిసారీ అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సరికొత్త స్పైడర్‌మ్యాన్‌ చిత్రం ‘స్పైడర్‌మ్యాన్‌ : నో వే హోమ్‌’. జాన్‌ వాట్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హొలాండ్‌, జెండియా కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఆ స్పైడర్‌ నన్ను కుట్టినదగ్గర నుంచి వారం రోజులపాటు నా జీవితం ఎప్పటిలానే సాధారణంగా ఉంది. ఆతర్వాతే నువ్వు దాన్ని కనిపెట్టావు’’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఓ విజువల్‌ వండర్‌లా సాగింది. యాక్షన్‌ సన్నివేశాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ అబ్బురపరిచేలా ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని