Sridevi Drama Company: ప్రతిభ ముందు అంగవైకల్యం చిన్నబోయింది!

వినోదంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల్ని పరిచయం చేసే బుల్లితెర కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రతి ఆదివారం ప్రసారమవుతుంది.

Updated : 15 Aug 2022 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వినోదంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల్ని పరిచయం చేసే బుల్లితెర కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్‌ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే షో ఇది. ఈ వారం ఎపిసోడ్‌ ఎలా ఉండబోతుందో తెలియజేసే ప్రోమో వచ్చేసింది. ఈ వీడియోలో.. అంగవైకల్యం ఉన్న కొందరి డ్యాన్సు పెర్ఫామెన్స్‌ ప్రత్యేకంగా నిలిచింది. అంగవైకల్యం అనేది శరీరానికి సంబంధించిందే తప్ప మనసుకి సంబంధించింది కాదని నిరూపించారు. హృదయాల్ని హత్తుకున్నారు. ‘వీరిని చూసి ఎలా బతకాలో నేర్చుకోవాలి’ అని ఆది, ‘మీ తపన ముందు మిగతావన్నీ చిన్నబోయాయి’ అని గెటప్‌ శ్రీను ఉద్వేగంతో మాట్లాడారు. మరోవైపు, తల్లీదండ్రులు లేని కొందరు చిన్నారులు ఈ షోకి విచ్చేసి, తమ పరిస్థితి గురించి వివరించి కంటతడి పెట్టించారు. ‘బిగ్‌బాస్‌’ ఫేం సోహైల్‌, దేత్తడి హారిక అతిథులుగా మెరిశారు. ‘భీమ్లా నాయక్‌’ పాటకి సోహైల్‌, ‘దిగు దిగు దిగునాగ’ గీతానికి హారిక తమదైన శైలిలో డ్యాన్స్‌ చేశారు. ఉర్రూతలూగించారు. ఎప్పటిలానే ఆది పంచ్‌లు నవ్వులు పూయించాయి. ఈ హంగామా అంతా చూడాలంటే అక్టోబరు 24 వరకు ఆగాల్సిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని