Sridevi Drama Company: ఇమ్మాన్యుయేల్‌, వర్ష కెమిస్ట్రీ.. డ్యాన్స్‌ అదిరింది!

బుల్లితెర జోడీ  ఇమ్మాన్యుయేల్‌, వర్ష ‘జలపాతం’ (ఉప్పెన) పాటకి డ్యాన్స్‌ చేసి, విశేషంగా అలరించారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమ వేదికపై ఇలా మెరిశారు.

Updated : 01 Oct 2021 23:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర జోడీ ఇమ్మాన్యుయేల్‌, వర్ష ‘జలపాతం’ (ఉప్పెన) పాటకి డ్యాన్స్‌ చేసి, విశేషంగా అలరించారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమ వేదికపై ఇలా మెరిశారు. ఎప్పుడూ నవ్వులు పంచే ఈ షోలో అప్పుడప్పుడు డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌లు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సుదర్శన్‌, కిరణ్మయి ‘జలపాతం’ గీతంతో సందడి చేశారు. వీరి పెర్ఫామెన్స్‌ ముగిసిన అనంతరం ‘అసలైన కెమిస్ట్రీ మేం చూపిస్తాం’ అంటూ ఇమ్మాన్యుయేల్‌, వర్ష తమ హావభావాలతో ఆకట్టుకున్నారు. ‘ఢీ’ ఫేం అక్సాఖాన్‌ ‘రారా కుమారా’ (గోవిందుడు అందరివాడేలే), పండు ‘బడిలో గుడిలో’ (దువ్వాడ జగన్నాథం), రోహిణి, రాకేశ్‌ మాస్టర్‌ ‘డింగూ డాంగు’ (ఎఫ్‌ 3) పాటలకి స్టెప్పులేసి వావ్‌ అనిపించారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని