Sridevi Drama Company: రాఖీ స్పెషల్‌.. కంటతడి పెట్టిస్తోన్న అన్నాచెల్లెళ్లు

ఈ ఆగస్టు 22కి రెండు ప్రత్యేకలున్నాయి. ఒకటి రాఖీ పౌర్ణమికాగా మరొకటి ప్రముఖ కథానాయకుడు చిరంజీవి పుట్టిన రోజు. పైగా ఆదివారం. ఇలాంటి సందర్భంలో ఎంత హంగామా ఉంటుందో ప్రోమోతోనే చూపించింది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం.

Updated : 17 Aug 2022 10:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఆగస్టు 22కి రెండు ప్రత్యేకలున్నాయి. ఒకటి రాఖీ పౌర్ణమికాగా మరొకటి ప్రముఖ కథానాయకుడు చిరంజీవి పుట్టిన రోజు. పైగా ఆదివారం. ఇలాంటి సందర్భంలో ఎంత హంగామా ఉంటుందో ప్రోమోతోనే చూపించింది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈ షో ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఓ ఎపిసోడ్‌ని రూపొందించారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. చిరంజీవి పాటలతో గెటప్‌ శీను, వర్ష, ఇమ్మాన్యుయేల్‌ తదితరుల డ్యాన్సులు, ‘జబర్దస్త్‌’ నటులతోపాటు వాళ్ల సోదరీమణుల పంచ్‌లతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది ప్రోమో. ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌కి ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌ అతిథిగా విచ్చేసి, సందడి చేశారు. వేదికపైకి వచ్చి నవ్వులు పూయించారు. ‘అన్నయ్యా.. పెళ్లి చేసేయండి అన్నయ్యా’ అని శివ జ్యోతి అడగ్గా ‘ఆల్రెడీ చేశానమ్మా. పెద్ద హిట్‌ అయింది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా పెళ్లి పెళ్లి అంటున్నారు’ అని తన సినిమా ‘పెళ్లి’ని ఉద్దేశించి కామెడీ పంచారు.

అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధం..

సుధీర్‌, రామ్‌ ప్రసాద్‌, కార్తీక్‌, బాబు తమ సిస్టర్స్‌తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నాన్‌స్టాప్‌ కౌంటర్లలతో కడుపుబ్బా నవ్వించారు. ఈ అక్కాతమ్ముళ్ల అనుబంధం ఇలా ఉంటే అన్నాచెల్లెళ్లుగా రవికృష్ణ, శివ జ్యోతి కంటతడి పెట్టిస్తున్నారు. పెళ్లికాకముందు రవి, జ్యోతి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. పెళ్లి తర్వాత శివ జ్యోతి జీవితం పూర్తిగా మారిపోతుంది. భర్తతో పెట్టే హింస తట్టుకోలేక మరణిస్తుంది. తన అన్నయ్యని కన్నీటి సంద్రంలో ముంచుతుంది. ఈ పర్ఫామెన్స్‌ చూసి కార్యక్రమంలో పాల్గొన్న అందరి హృదయాలే కాదు వీడియో చూస్తోన్న ప్రేక్షకుల హృదయాలు బరువెక్కేలా ఉన్నాయి. పూర్తి ఎపిసోడ్‌కి ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది. అప్పటి వరకు ప్రోమో చూడండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని