
Puneet Rajkumar: ఇలా బతకాలి అనిపించిన నటుడు.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో పునీత్‌కి నివాళి!
ఇంటర్నెట్ డెస్క్: ‘ఈటీవీ’ వేదికగా ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో కన్నడ నటుడు దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించారు. సమాజానికి ఆయన చేసిన సేవల్ని గుర్తుచేస్తూ ఓ కంటెస్టెంట్ అభినయించి హృదయాల్ని హత్తుకున్నారు. ‘దేవుడు చేయాల్సిన పనులన్నీ పునీత్ చేశారు. అందుకే.. నువ్వు భూమిపై ఏం చేస్తావ్? నా పక్కన కూర్చో అని ఆ దేవుడే ఆయన్ను తీసుకెళ్లాడేమో!’ అని ఇంద్రజ, ‘బతికితే ఇలా బతకాలిరా అని ప్రతి ఒక్కరూ అనుకునేలా చేసిన ఏకైక స్టార్ ’ అని ఆది.. పునీత్ రాజ్‌కుమార్‌ని కొనియాడారు. ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’ పేరుతో రూపొందించిన ప్రత్యేక ఎపిసోడ్‌లో పునీత్‌ని స్మరించుకున్నారు. ఈనెల 21 ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో పునీత్‌కి నివాళులర్పించిన దృశ్యాలతోపాటు ‘ఇండియన్ ఐడల్ సీజన్-12’ ఫేం షణ్ముఖ ప్రియ సింగింగ్ పెర్ఫామెన్స్, నటుడు రాజ్ తరుణ్ కామెడీ సన్నివేశాలు కనిపించాయి. మరి ఆడవాళ్లు కోరుకున్నట్టు వారికి ఆదివారం సెలవు లభించిందా? ఇంతకీ వారు సెలవు ఎవరిని అడిగారు? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: సీఎంను కలిసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
-
Sports News
Virender Sehwag: రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‌గా తప్పించొచ్చు: సెహ్వాగ్
-
General News
Khairatabad Ganesh: ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే!
-
Movies News
Samantha: సల్మాన్ వీడియోపై సామ్ ‘లవ్’ రిప్లై
-
Business News
ITR filing: ట్యాక్స్ ఫైలింగ్‌కి సిద్ధమయ్యారా? ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి..
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది