Srinu Vaitla: దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు....

Updated : 28 Nov 2021 08:41 IST

హైదరాబాద్‌: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీనువైట్ల కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని