Pushpa: 2021 సెన్సేషన్.. ‘శ్రీవల్లి’ గీతం ఫుల్ వీడియో వచ్చేసింది
2021లో విడుదలై అత్యధిక మంది శ్రోతల్ని అలరించిన గీతాల్లో ‘శ్రీవల్లి’ ఒకటి. ‘పుష్ప’ సినిమాలోని ఈ పాట లిరికల్ వీడియో విడుదలైన అనతి కాలంలోనే లక్షల వీక్షణలు సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: 2021లో విడుదలై అత్యధిక మంది శ్రోతల్ని అలరించిన గీతాల్లో ‘శ్రీవల్లి’ ఒకటిగా నిలిచింది. ‘పుష్ప’ సినిమాలోని ఈ పాట (లిరికల్ వీడియో) విడుదలైన అనతి కాలంలోనే లక్షల వీక్షణలు సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ వీడియోలో అక్కడక్కడా చూపించిన నాయకానాయికల హావభావాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాయి. అల్లు అర్జున్, రష్మిక లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. చంద్రబోస్ సాహిత్యం, సిధ్ శ్రీరామ్ గానం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎన్నో యువ హృదయాలను హత్తుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఫుల్ వీడియో వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి చిత్ర బృందం ఆ సర్‌ప్రైజ్‌ను అందించింది. సోషల్ మీడియా వేదికగా ‘శ్రీవల్లి’ ఫుల్ వీడియోను మంగళవారం విడుదల చేసింది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌లు అందిస్తోంది. ఇప్పటికే డైలాగ్ ప్రోమోలు, డిలీటెడ్ సన్నివేశాలను విడుదల చేసింది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, ఫహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలతో మెప్పించారు. ఈ సినిమా కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ‘పుష్ప: ది రూల్’ పేరిట ఈ సినిమా రెండో భాగం చిత్రీకరణ త్వరలోనే ప్రారంభంకానుంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!